కేంద్రం అభివృద్ది చేస్తుంటే, రాష్ట్రం అడ్డపడుతుంది : పీఎం మోదీ

కేంద్రం అభివృద్ది చేస్తుంటే, రాష్ట్రం అడ్డపడుతుంది : పీఎం మోదీ
X

తెలంగాణకు ఎయిమ్స్ ను అందించే సౌభాగ్యం తమ ప్రభుత్వానికి లభించిందని అన్నారు ప్రధాని మోదీ. ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్న మోదీ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది... ఈస్ ఆఫ్ లివింగ్, ఈస్ ఆఫ్ ట్రావెలింగ్, ఈస్ ఆప్ డూయింగ్ బిజినెస్ ను చేసుకునే విధంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది పథకాలను చేపట్టిందని అన్నారు. అయితే... అందులో తనకు ఓ విషయంలో కొంత దుఖం ఉందని చెప్పారు మోదీ.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన చాలా ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం లేదని, అభివృద్దికి అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు అందాల్సిన ప్రగతి సకాలంలో అందకుండా పోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తన వినతిని అందిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ది పనులలో ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ది ఫలాలను దేశంలోని ప్రతీ ఒక్కరికి చేరేలా... పగలూ రాత్రి శ్రమిస్తుందని అన్నారు. కానీ కొంత మంది వ్యక్తులు అభివృద్దికి ఆటంకం కలిగేలా చూస్తున్నారని అన్నారు. ఇలాంటి కుటుంబ పార్టీలు, కొడుకు, అల్లుడూ అంటూ అవినీతిని పెంచి పోషిస్తున్నారని అన్నారు. వారికి నిజాయితీగా పనిచేసేవారిని చూస్తే కష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు దేశ హితంతో, సమాజ అభివృద్దితో ఎలాంటి అవసరం లేదని అన్నారు. ఇలాంటి వారికి, వారి స్వార్థమే తప్ప ఇంకొకటి పట్టదని అన్నారు. ప్రతీ ప్రాజెక్ట్ లో వాళ్ల స్వార్థమే చూసుకుంటారని చెప్పారు. ఇలాంటి వ్యక్తులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు వేరు వేరు కాదని మోదీ అన్నారు.

Tags

Next Story