దేశంలోనే రెండో రిచెస్ట్ రీజినల్ పార్టీ బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే రెండో రిచెస్ట్ ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఒక్క ఏడాదిలోనే ఐదు రెట్ల ఆదాయం పెంచుకుంది గులాబీ పార్టీ. 2022 మార్చి 31 నాటికి బీఆర్ఎస్ ఆదాయం 218.11 కోట్లకు చేరింది. ఈమేరకు గతేడాది ఆదాయ లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘానికి గులాబీ పార్టీ అందజేసింది. ఎన్నికల బాండ్ల రూపంలో 218 కోట్లు వచ్చాయని ఈసీకి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టులో బీఆర్ఎస్ తెలిపింది.
బీఆర్‌ఎస్ సహా వైసీపీ, టీడీపీ, డీఎంకే, జేడీయూ, ఆప్ వంటి పది ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆదాయాన్ని ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా పది ప్రాంతీయ పార్టీలు 852 కోట్లు సంపాదించినట్లు ఏడీఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 36 ప్రాంతీయ పార్టీలకు బాండ్ల ద్వారా 12 వందల 13 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేసింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అత్యధికంగా 318 కోట్లు ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ ప్రాంతీయ పార్టీగా నిలిచింది. తర్వాతి స్థానంలో బీఆర్‌ఎస్ ఉంది. కేవలం ఐదు పార్టీల ఆదాయమే ఒక వెయ్యి 24.44 కోట్లుగా ఉందని ఏడీఆర్ ప్రకటించింది. 35 పార్టీల్లో 20 పార్టీల ఆదాయం పెరిగిందని.. 15 పార్టీల ఆదాయం తగ్గిందని తెలిపింది. ఇక 2021-22 ఏడాదికి అన్ని పార్టీల ఖర్చు కలిపి రూ. 190 కోట్లుగా ఉందని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com