కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రేవంత్ ఫైర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రేవంత్ ఫైర్
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. TSPSC కేసులో ప్రభుత్వంలోని పెద్దలను కాపాడుకునేందుకే సిట్‌ ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు. ప్రతీ ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మో దీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఈ నెల 21న నల్గొండ మహ్మాత్మా గాంధీ వర్సిటీలో నిరుద్యోగ నిరసన నిర్వహిస్తామని చెప్పారు. మే 4 లేదా 5న సరూర్‌ నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వ హిస్తామని వెల్లడించారు. ఈ సభలో ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నట్లు రేవంత్‌ స్పష్టం చేశారు.

Next Story