TS : చెరువుగట్టు దేవస్థానంలో ప్రైవేటు ఉద్యోగుల చేతివాటం

TS : చెరువుగట్టు దేవస్థానంలో ప్రైవేటు ఉద్యోగుల చేతివాటం

నల్గొండ జిల్లా చెర్వుగట్టు దేవస్థానంలో ప్రైవేటు ఉద్యోగులు చేతివాటం చూపించారు. ముడుగుండ్ల దర్శన టికెట్లలో అవకతవకలకు పాల్పడ్డారు. ప్రతీ అమావాస్య రోజు స్వామివారి దర్శనానికి సుమారు 8నుంచి 10వేల మంది భక్తులు ఆలయనాకి వస్తుంటారు. అయితే స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు దేవస్థానం టికెట్‌ ధరలను 10 రూపాయలతో పాటు 50 రూపాయలుగా నిర్ధారించింది. అయితే కొంత మంది కేటుగాళ్లు నకిలి టికెట్స్‌తో దేవస్థాన ఆదాయానికి గండికొడుతున్నారు. నకిలీ టికెట్స్ ముద్రించి.. భక్తులకు అమ్ముకుంటున్నారు. ఈసారి అమావస్యకు కేవలం 3వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోవడంతో ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవో నవీన్ ఫోకస్ పెట్టారు. దీంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేటుగాళ్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఇన్‌ఛార్జ్ ఈవో నవీన్‌.. 8మంది ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. ఇక ఘటనపై విచారణకు ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story