తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హోమశిల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్టొని సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆరో అంతస్థులో ఉన్న తన చాంబర్ కు చేరుకుని 1.31 నిమిషాలకు తన సీటులో ఆసీనులయ్యారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలను అందించారు. ఆ తర్వాత ఆయన ఆరు ఫైల్లపై సంతకాలు చేశారు. వీరితోపాటు మంత్రులు కూడా తమ చాంబర్ లలో ఆసీనులయ్యారు. మొట్టమొదటి సంతకాన్ని "పోడు భూముల" ఫైల్ పై సంతకం చేశారు. అనంతరం వివిధ పథకాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు సీఎం కేసీఆర్.

Tags

Next Story