సిద్దిపేట మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన

హన్మకొండ, సిద్దిపేట జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇవాళ బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. హుస్నాబాద్‌లో దాదాపు 35 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని బస్‌డిపో గ్రౌండ్‌లో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో......... మినీ స్టేడియంలో దిగిన తరువాత కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హనుమకొండకు వెళతారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా హుస్నాబాద్ గులాబీమయమైంది. రెండు కిలోమీటర్ల మేర గులాబీ తోరణాలు కట్టారు. కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, బెలూన్లను ఏర్పాటు చేశారు. సభకు ముందు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి జనాన్ని తరలిస్తున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే సతీ్‌షకుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కేటీఆర్ పర్యటనకు 490 మందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ 2018లో ప్రభుత్వాన్ని రద్దు చేసిన అనంతరం ఎన్నికల సందర్భంగా సెప్టెంబరు 7వ తేదీన హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే పట్టణంలో ఆశీర్వాద సభ ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు పట్టణంలోని బస్‌డిపో గ్రౌండ్‌లో ఆశీర్వాద సభ ఏర్పాటు చేయగా ఇప్పుడు అదే గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ వస్తుండటంతో... వరాలు కురిపిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళతామంటున్నారు ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com