TS : దిగ్విజయంగా కొనసాగుతోన్న భట్టి పాదయాత్ర

TS : దిగ్విజయంగా కొనసాగుతోన్న భట్టి పాదయాత్ర

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. సీఎల్పీ నేత ఎక్కడికి వెళ్లిన జనం నీరాజనం పడుతున్నారు. ప్రతి గ్రామంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా భట్టివిక్రమార్కను కలిస్తున్న జనం.. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు తెలుసుకుంటున్న భట్టి అండగా ఉంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు భట్టి పాదయాత్రకు ప్రజాగాయకుడు గద్దర్ మద్దతు తెలిపారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్న గద్దర్ తన పాటలతో కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజ పరిచారు.

Tags

Next Story