జేపీఎస్‌ల సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. సమ్మె విరమించకుంటే..
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్‌లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి తెలిపారు. విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. లేకుంటే సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారి స్థానంలో తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు.
గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లేదా రిజర్వేషన్ల ప్రతిపాదికన విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జేపీఎస్‌లు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com