అరుణ్‌పిళ్లై బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

అరుణ్‌పిళ్లై బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరుణ్‌పిళ్లై బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది రౌస్‌ అవెన్యూ కోర్టు.ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు తీర్పు వెల్లడించనుంది.ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత ప్రతినిధిగా పిళ్లై ఉన్నారన్న ఈడీ వాదనను వ్యతిరేకించారు పిళ్లై తరపు లాయర్‌.స్టేట్‌మెంట్‌ రికార్డు సమయంలో అరెస్ట్‌ చేస్తామని.. భయపెట్టడంతో కవిత పాత్ర ఉన్నట్లు సంతకం చేశారని,గతంలో చాలా కేసుల్లో 20 నెలల తర్వాత కూడా..స్టేట్‌మెంట్‌ ఉపసంహరించుకున్న సందర్భాలున్నాయని వాదించారు.లిక్కర్‌ వ్యాపారంలో పిళ్లై సొంతడబ్బుతో ఇన్వెస్ట్‌ చేశారని పాలసీ రూపకల్పనలో పిళ్లై పాత్ర లేదని న్యాయవాది తన వాదనలు వినిపించారు.

Next Story