TS : అమరాజా గిగా కారిడార్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

TS : అమరాజా గిగా కారిడార్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ లో అమరాజా గిగా కారిడార్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌. భారత్‌లోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ సంస్ధ అమర రాజా అన్న ఆయన దివిటిపల్లి లో కంపెనీ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు.ఎనిమిది రాష్ట్రాలు పోటీపడ్డా ఇక్కడే కంపెనీ నెలకొల్పారన్నారు. అమరాజా కంపెనీతో పది లక్షల ఉద్యోగాలు వస్తాయని,-చుట్టుపక్కల ప్రాంత రూపు రేఖలు మారిపోతాయన్నారు. కొందరు అభివృద్ధి నిరోధకులు లేని పోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారని వారి మాటలు నమ్మోద్దన్నారు కేటీఆర్‌.

అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఏపీ సర్కార్‌పై పరోక్షంగా కేటీఆర్‌ సెటైర్లు వేశారు. అమర రాజా కంపెనీ కాలుష్యం రహిత కంపెనీ అని, అనుమానం ఉంటే ప్రత్యేక బస్సుల్లో ఇతర ప్లాంట్లకు వెళ్లి చూడాలన్నారు. కొందరు ప్రగతి నిరోధకులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.అమర రాజా కంపెనీ కోసం 8 రాష్ట్రాలు పోటీ పడ్డాయని.. ఈ కంపెనీతో ‌చుట్టుపక్కల ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు.

లిథియం అయాన్ బ్యాట‌రీ మేకింగ్‌లో భార‌త‌దేశంలోనే ఇది అతి పెద్ద పెట్టుబ‌డి అని కేటీఆర్ అన్నారు. అమ‌ర‌రాజా గ్రూప్ 9 వేల 500 కోట్ల పెట్టుబ‌డిని తీసుకొచ్చినందుకు ధ‌న్యవాదాలు తెలిపారు. భ‌విష్యత్ అంతా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌దేనన్నారు. రాబోయే 20, 30 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ వాహ‌నాల్ని ప‌క్కన పెట్టి.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్ని వాడతారన్నారు. ఆ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో వాడే బ్యాట‌రీనే అమరరాజా కంపెనీ త‌యారు చేస్తుందన్నారు. జీరో లిక్విడ్ డిశ్చార్జితో అంత‌ర్జాతీయ ప్రమాణాల‌తో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాట‌రీల‌తో ఒక్క చుక్క కాలుష్యం కూడా ఉండదని కేటీఆర్ తెలిపారు.

Tags

Next Story