ఏప్రిల్‌ 9 నుంచి సికింద్రాబాద్‌ To తిరుపతి వందేభారత్‌ సేవలు

ఏప్రిల్‌ 9 నుంచి సికింద్రాబాద్‌ To తిరుపతి వందేభారత్‌ సేవలు

సికింద్రాబాద్‌,తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ రైలు షెడ్యూల్‌ను రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఈనెల 9న ప్రధాని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి నల్గొండ,గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి నెల్లూరు , ఒంగోలు , గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు రైలు నడవనుంది.

Tags

Next Story