కమలాపూర్ BRSలో భగ్గుమన్న వర్గవిబేధాలు..ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి ముందే

కమలాపూర్ BRSలో భగ్గుమన్న వర్గవిబేధాలు..ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి ముందే
హనుమకొండ జిల్లా కమలాపూర్ BRSలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ విభేదాలు బయటపడ్డాయి. MLC పాడి కౌశిక్ రెడ్డి సాక్షిగా...ఒకరిపై ఒకరు కుర్చీలు

హనుమకొండ జిల్లా కమలాపూర్ BRSలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ విభేదాలు బయటపడ్డాయి. MLC పాడి కౌశిక్ రెడ్డి సాక్షిగా...ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు BRS నేతలు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాడి కౌశిక్ రెడ్డి... వెనుదిరిగారు. పార్టీలో ఇబ్బంది ఉన్నవాళ్లు బయటికి వెళ్లిపోవాలంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ BRSలో ఏమీ జరుగుతుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. సీనియర్లు వర్సెస్ కౌశిక్ వర్గంగా రాజకీయం నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. విబేధాలు కొనసాగితే పార్టీకి నష్టమంటున్నారు BRS నేతలు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు అన్నట్లుగా పొలిటికల్ హీట్ ఉంది.

Tags

Next Story