ఆదిలాబాద్‌ BRS నాయకుల మధ్య లుకలులు

ఆదిలాబాద్‌ BRS నాయకుల మధ్య లుకలులు

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ బీఆర్‌ఎస్‌లో లుకలుకలు భయటపడ్డాయి. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీపీ మధ్య రాజకీయం సెగలు పుట్టిస్తోంది. పోటాపోటీ ఆత్మీయ సమ్మేళనాలతో ఒక్కసారిగా బోథ్‌లో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌, ఎంపీపీ శ్రీనివాస్ పోటాపోటీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీపీ శ్రీనివాస్‌ బీఆర్ఎస్‌ పథకాలతో భరోసా, కేసీఆర్ శ్రీరామ రక్ష అనే పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఫంక్షన్‌ హాల్‌కు ఉన్నట్టుండి యజమాని తాళం వేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే చెప్పడంతోనే తాళం వేసినట్లు ఎంపీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎంపీపీ వర్గీలు ఆందోళనలు, హెచ్చరికలతో ఎట్టకేలకు ఫంక్షన్ హాల్ తాళాలను ఓపెన్ చేయించారు పోలీసులు. ఈ ఘటనతో బోథ్‌లో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.

Tags

Next Story