TS : రాష్ట్ర వ్యాప్తంగా CPR ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం

TS : రాష్ట్ర వ్యాప్తంగా CPR ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా CPR ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అయ్యింది. గత కొన్ని రోజులుగా హార్ట్ ఎటాక్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. గోల్డెన్ మినెట్‌లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇటీవల కాలంలో గుండె పోటు అనేది సర్వసాధారం అయిపోయింది.


మారుతున్న జీవన శైలితో ఎప్పుడు గుండెకు ఆపాయం కలుగుతుందనేది ఎవరికి తెలియడం లేదు. అయితే గుండె సడెన్‌గా ఆగిపోతే మాత్రం.. తక్షణ చర్యలు అమలు చేస్తే ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకు వెంటనే సీపీఆర్‌ను ఉపయోగించాలని.. అలా చేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చంటున్నారు. ఈ మధ్య కాలంలో కార్డియాక్‌ అరెస్ట్ అయిన వారిని సీపీఆర్ చేసి సేఫ్‌ చేసిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీపీఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధం అయ్యింది. దీని కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story