బిల్లులు పెండింగ్.. GHMC టిప్పర్ లారీలు ఆగిపోయాయి

బిల్లులు పెండింగ్.. GHMC టిప్పర్ లారీలు ఆగిపోయాయి
ఆరు నెలలుగా తమ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ... టిప్పర్ ఓనర్లు మెరుపు సమ్మె చేశారు

పెండింగ్‌ బిల్లుల కారణంగా GHMCలో చెత్త తరలించే టిప్పర్లు ఆగిపోయాయి. ఆరు నెలలుగా తమ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ... టిప్పర్ ఓనర్లు మెరుపు సమ్మె చేశారు. దీంతో 500 టిప్పర్లతో చెత్త తరలించే పని ఆగిపోయింది. దీంతో ట్రాన్‌ఫర్ స్టేషన్లలో కుప్పలు, తెప్పలగా చెత్త పేరుకుపోయింది. బకాయిలు 150 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లులు రాకపోవడం తో EMI కట్టలేక పోతున్నామని టిప్పర్‌ యజమానులు అంటున్నారు. డీజిల్‌కు డబ్బులు చెల్లించలేకపోతున్నామని... సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Tags

Next Story