Hyderabad: 10 రోజులకు రూ.54 లక్షల బిల్లు.. ఇదీ ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు

Hyderabad: 10 రోజులకు రూ.54 లక్షల బిల్లు.. ఇదీ ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు
X

Hyderabad: రోగుల ధనాన్ని పీల్చి పిప్పి చేయడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 10 రోజుల ట్రీట్మెంట్ కు రూ.54 లక్షల బిల్లును వేశారు. మజ్లిస్ బచావో తెహ్రిక్ ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ ఆస్పత్రి బిల్లును షేర్ చేశారు. సయ్యద్ రహ్మత్ ఉద్దీన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యాడు. 10 రోజుల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ 10 రోజులకు గాను రూ.54 లక్షల బిల్లును వేశారు. రోగి కుటుంబ సభ్యులు ఇప్పటికే రూ.20 లక్షలు చెల్లించారని ఖాన్ తెలిపారు. మిగిలిన రూ.29 లక్షల రూపాయలను కట్టాలని హాస్పిటల్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.





ఉన్నదంతా ఖర్చుపెట్టేశాము. ఇంక తమ దగ్గర వైద్యం చేయించేందుకు, డబ్బు లేని కారణంగా రోగిని గాంధీ లేదా నిమ్స్ హాస్పిటల్ కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రోగి బంధువులు అభ్యర్థించినట్లు తెలిపారు.





గతంలో కూడా పలువురు రోగులకు అధికంగా బిల్లులు వేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కోవిడ్ చికిత్స సమయంలో రోగుల నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వం సత్వరమే స్పందించి అధిక మొత్తంలో వసూలు చేసిన డబ్బును రోగులకు తిరిగి అందజేయాలని ఆదేశించింది. RTI నివేదిక ప్రకారం జూన్ 22,2021 నాటికి రోగులకు మొత్తం రూ.1,61,22,484 తిరిగి ఇవ్వబడింది.




మధ్యతరగతికి చెందిన రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటేనే వెనకడుగువేస్తున్నారు. రోగులు ఎలాంటి బీమా పరిధిలోకి రాకపోతే వారి సమస్య మరింత కష్టంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ , కేంద్ర ప్రభుత్వం యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం విలీనం తర్వాత గరిష్టంగా ఒక్కో కుటుంబానికి, సంవత్సరానికిగాను 5 లక్షలు పెరిగింది.

Tags

Next Story