జనంపై దూసుకెళ్లిన 104 వాహనం

జనంపై దూసుకెళ్లిన 104 వాహనం
X

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 104 వాహనం బీభత్సం సృష్టించింది. జాలిగామ గ్రామంలో వాహనం జనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు వాహనాన్ని ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story