తెలంగాణలో కొత్తగా 1078 కేసులు.. ఆరుగురు మృతి..!

తెలంగాణలో కొత్తగా 1078 కేసులు.. ఆరుగురు మృతి..!
తెలంగాణలో కరోనా మహహ్మరి కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెయ్యికు పైగా కేసులు వచ్చాయి.

తెలంగాణలో కరోనా మహహ్మరి కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెయ్యికు పైగా కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1078 కేసులు నమోదుకాగా.. ఆరుగురు మృతిచెందారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 283 కేసులు నమోదుకావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 113, రంగారెడ్డి జిల్లాలో 104, నిజామాబాద్ జిల్లాలో 75, సంగారెడ్డి జిల్లాలో 46, నిర్మల్ జిల్లాలో 40, జగిత్యాల జిల్లాలో 40, కరీంనగర్ 34, నల్లగొండ జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 3 లక్షల 10వేల 819కు చేరుకోగా.. మరణాల సంఖ్య 1712కి చేరింది. ప్రస్తుతం 6900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.22 శాతంగా ఉంది.

Tags

Next Story