HYD: హైదరాబాద్ లో 1184 డ్రంక్&డ్రైవ్ కేసులు

హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకల రోజున 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు ఓ శుభవార్త వచ్చింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్ల సర్వీస్ ను మేడ్చల్, షామీర్ పేట్ వరకు పొడగించనున్నారు. రెండు కొత్త కారిడార్ల DPR తయారీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే DPRలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డీపీఆర్ సిద్దం చేసిన ఫేజ్-2బీలో చేర్చి.. కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపాలని సీఎం ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com