తెలంగాణ

Siddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత..

Siddipet: సిద్దిపేట జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 120 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు

Siddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత..
X

Siddipet: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 120 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం వండిన చికెన్‌లో మిగిలిన సూప్‌లోనే వంకాయ, ఆలుగడ్డ వేసి కూర వండారు. ఇదే సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించారు. ఇది తిన్న విద్యార్థులు రాత్రి కల్లా విరేచనాలు చేసుకున్నారు. తీవ్ర అస్వస్థలకు గురవడంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసిన మంత్రి హరీష్‌ రావు.. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్ధులందరూ కోలుకున్నారని డ్యూటీ డాక్టర్‌ లక్ష్మారెడ్డి తెలిపారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES