బుడ్డోడు భలేటోడు.. వేపాకుల్ని చాక్లెట్లలా..

బుడ్డోడు భలేటోడు.. వేపాకుల్ని చాక్లెట్లలా..
చిత్రంగా ఉన్నాడు ఈ చిన్నోడు.. చేదుగా ఉన్న వేపాకులను చాక్లెట్లలా తినేస్తున్నాడు.

చిత్రంగా ఉన్నాడు ఈ చిన్నోడు.. చేదుగా ఉన్న వేపాకులను చాక్లెట్లలా తినేస్తున్నాడు. కాకరకాయ కూర పెట్టాలంటేనే అమ్మ కాస్త ఆలోచిస్తుంది వీడు తింటాడో లేదో అని.. కానీ ఈ బుడ్డోడేమో అమ్మా.. నువ్వు ఏది పెట్టినా తినేస్తాను ఆఖరికి వేపాకులు కూడా అని అన్నాడో ఏమో. అందుకే నాన్న వాడి ముందు ఉంచిన వేపాకులను హ్యాపీగా తినేస్తున్నాడు. ఆరు నెలల నుంచి మా వాడు వేపాకులు తింటున్నాడు అని అమ్మా నాన్న చెబుతున్నారు.

రాయణపేట ఊట్కూరుకు చెందిన ఉమాదేవి, సూరం ప్రకాశ్ దంపతులకు కుమారుడు తనిష్క్ (15 బాలుడు) ఉన్నాడు. తండ్రి ఉదయం, సాయింత్రం వేప కొమ్మతో పళ్లు తోముకుంటూ వాటికి ఉన్న ఆకుల్ని, పూలని బుడ్డోడి ముందు పెట్టేవారు. వాడు ఆడుతూ, పాడుతూ వాటిని తినడం అలవాటు చేసుకున్నాడు.

రోజూ వేపాకు తింటే ఏమైనా అలెర్జీలు వస్తాయేమో అని తల్లిదండ్రులు భయపడ్డారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ చిన్నారి అలవాటుని నారాయణ పేటలోని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. ఇలా రోజూ వేపాకులు తింటే ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రాకపోగా యాంటీబాడీలు పెరుగుతాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story