గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 28,909మంది అభ్యర్థులు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్షలు రానేవచ్చాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఆధ్వర్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28,909 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉమ్మడి నల్గొండలో అభ్యర్థుల సంఖ్య, కేంద్రాల సంఖ్య ఈ విధంగా ఉంది.
-నల్లగొండలో 51 కేంద్రాలు, 16,095 మంది అభ్యర్థులు.
-సూర్యాపేటలో 32 పరీక్ష కేంద్రాలు, 9,170 మంది అభ్యర్థులు.
-యాదాద్రిలో 12 కేంద్రాలు, 3,644 మంది అభ్యర్థులు.
-స్ట్రాంగ్ రూం నుంచి పరీక్ష కేంద్రాల వరకు బందోబస్తుతో పేపర్‌లను తరలింపు.
-ఉదయం 10:15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరణ
-ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహణ.
-నల్లగొండ కంట్రోల్ రూం నంబర్ 18004251442.
-అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
-పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాళ్లకు షూస్ అనుమతించరు.
-హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రి నంబర్ 91211 47135 ను అందుబాటు
-పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను.
-ఏదైనా ఓరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి (ఆదార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ..)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com