Mahabubabad: ఆ కుటుంబంపై పగబట్టిన నీలిత్రాచు పాము..

X
Mahabubabad (tv5news.in)
Mahabubabad: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గుర్ని పాము కాటేసింది. ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి కన్నుమూయడంతో.. ఆ ప్రాంతమంతా విషాయఛాయలు అలుముకున్నాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము.. చిన్నారిని కాటేసింది. ఉదయం చూసేసరికి చిన్నారి నోటి నుంచి నురుగు రావడంతో.. కంగారుగా పాప నిద్రిస్తున్న దుప్పటిని తీశారు. దాంట్లో నుంచి బయటపడ్డ పాము.. తల్లిదండ్రులను కూడా కాటేసింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
