Nirmal: గురుకుల హాస్టల్‌లో హుక్కా మత్తులో విద్యార్థులు.. గది నుంచి పొగలు రావడంతో..

Nirmal: నిర్మల్ జిల్లా ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌లో విద్యార్ధులు హుక్కా కిక్కులో ముగిపోయారా? ఏకంగా వసతి గృహం హుక్కాకు అడ్డాగా మారిందా? తాజా పరిణామాలు చూస్తే.. అది నిజమేననిపిస్తోంది. ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోని హాస్టల్‌లో హుక్కా ఉపయోగిస్తూ దొరికిపోయారు ముగ్గురు విద్యార్ధులు. ప్రిన్సిపాల్ తనిఖీ చేస్తున్న సమయంలో.. గది నుంచి పొగలు రావడంతో హుక్కా వ్యవహారం వెలుగు చూసింది.
హుక్కా సాయంతో.. ముగ్గురు విద్యార్థులు పొగతాగుతున్నట్లు గుర్తించారు ప్రిన్సిపాల్. జరిగిన విషయం ఆ విద్యార్ధుల తల్లిదండ్రులకు చెప్పి వారిని ఇంటికి పంపించారు. కళాశాలకు హుక్కా ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు హాస్టల్ అధికారులు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపతి సైతం రాత్రి కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. హాస్టల్‌లో హుక్కా వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com