కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి
సాయినగర్‌కాలనీలో ఉన్న టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు

హైదరాబాద్‌ కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినగర్‌కాలనీలో ఉన్న టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మృతులు ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ అగ్నిప్రమాదం సంభవించగా..క్షణాల్లోనే మంటలు పక్క భవనంలోకి వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Tags

Next Story