తెలంగాణలో కొత్తగా 3,052 కేసులు, ఏడుగురు మృతి..!

తెలంగాణలో కొత్తగా 3,052 కేసులు, ఏడుగురు మృతి..!
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3వేల 52 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో మరో ఏడుగురు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3వేల 52 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,772కి చేరింది. కరోనా నుంచి నిన్న మరో 778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24వేల 131 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 16వేల 118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే లక్షా 13వేల కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు కోటి 11లక్షల 81వేల పరీక్షలు చేశారు.

Tags

Next Story