TS Corona Cases: కొత్తగా 338 కేసులు.. ఒకరు మృతి

X
తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 338 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 73,207 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,58,054కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో ఒకరు మృతి చెందారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 84 కేసులు నమోదైనట్లు తెలిపింది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,873కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.48 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. . రాష్ట్రంలో ప్రస్తుతం 5,864 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
