TS Corona Cases: కొత్తగా 340 కొవిడ్ కేసులు..ఇద్దరు మృతి

X
తెలంగాణలో కరోనా కేసులు నమోదువుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 340 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,102 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,57,716కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,872కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 359 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,47,953కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
