Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 3,660 కరోనా కేసులు..!

X
By - TV5 Digital Team |20 May 2021 7:29 PM IST
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు చేయగా 3,660 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా కరోనాతో మరో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది. ఇవాళ 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com