తెలంగాణలో కొత్తగా 4,446 కరోనా కేసులు.. 12 మంది మృతి..!

తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్కరోజే లక్షా 26వేల 235 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4వేల 446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో కరోనాతో ఒక్కరోజే 12 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి శుక్రవారం వెయ్యి 414 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 33వేల 514కి చేరింది. వీరిలో 22వేల 118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 598 కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో గాంధీ ఆస్పత్రి మళ్లీ కొవిడ్ ఆస్పత్రిగా మారుతోంది. గాంధీలో పూర్తి స్థాయిలో కొవిడ్ సేవలు అందించాలని ఆస్పత్రి అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వ్యులు జారీచేసే వరకు గాంధీలో కొవిడ్ రోగులనే చేర్చుకోవాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. గాంధీ హాస్పిటల్‌లో అత్యవసర, సాధారణ అడ్మిషన్లు నిలిచిపోయాయి. గాంధీ ఆస్పత్రిలో మొత్తం వెయ్యి 850 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం 500 మంది కరోనా పాజిటివ్‌లు, 500 వరకు నాన్ కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు.
గాంధీలో చికిత్స పొందుతున్న నాన్‌కొవిడ్ రోగుల్లో ఆరోగ్యం మెరుగ్గా ఉన్న వారిని ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. కొత్తగా ఎవరైనా వస్తే వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తారు. నాన్‌కొవిడ్ ప్రెగ్నెసీ కేసులు సుల్తాన్ బజార్ ప్రసూతి, పేట్లబురుజు మెటర్నిటీ, నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తారు. రోడ్డు ప్రమాదాల కేసులు, సీరియస్ నాన్‌కొవిడ్ రోగులు ఎవరైనా వస్తే వారికి ప్రాథమిక చికిత్స చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తారు. 600 వరకు ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్ చికిత్సలు కేటాయించారు. అవసరాన్ని బట్టి ఐసీయూ ఆక్సిజన్ వార్డులను పెంచనున్నారు. కరోనా పాజిటివ్‌లకు త్రీలైన్ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com