Munawar: మునావర్ షోలో దాదాపు 50మంది బీజేపీ కార్యకర్తల అరెస్ట్..

Munawar: ఎంతో ఉత్కంఠ రేపిన కామేడియన్ మునావర్ షో.. అడపాదడప ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగా ముగిసింది. రెండున్నర గంటల పాటు సాగిన కామెడీ షోలో ఎక్కడా కమ్యూనల్ ప్రస్తావన రాలేదని సమాచారం. ఇక షోను అడ్డుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. పోలీసులు చాక చక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ప్రశాంతంగా ముగిసింది.
షోను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది బీజేపీ. విడతల వారిగా శిల్పకళావేదిక ముట్టడించేందుకు యత్నించింది. దీంతో దాదాపు 50మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని గచ్చిబౌలీ పీఎస్‌కి తరలించారు. అటు అవాంఛనీయ ఘటనలు జరక్కుండా శిల్పకళా వేదిక పోలీసుల బందోబస్తు వద్ద కొనసాగుతోంది.
అంతకుముందు మునావర్‌షో జరగనివ్వమంటూ హెచ్చరిచారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ప్రభుత్వానిది, మంత్రి కేటీఆర్‌దే బాధ్యత అని వార్నింగ్ ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో మునావర్ షోలకు అనుమతి లేదని.. హైదరాబాద్‌లో మాత్రం కావాలనే అనుమతి ఇచ్చారని సర్కారుపై మండిపడ్డారు. కామెడీ పేరుతో దేవతలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమన్నారు రాజాసింగ్.
ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో శిల్పకళా వేదిక వద్ద ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరి వద్ద ఆధార్ సమాచారం తీసుకున్నాకే షోకు అనుమతించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com