Overweight or Obese: ప్రతీ ఇద్దరు మహిళలలో ఒకరికి ఊబకాయం... హైదరాబాద్‌లో పరిస్థితి ఇదీ..!

Overweight or Obese:  ప్రతీ ఇద్దరు మహిళలలో ఒకరికి ఊబకాయం... హైదరాబాద్‌లో పరిస్థితి ఇదీ..!
Overweight or Obese: ప్రస్తుతం అందర్నీ వేధిస్తున్న సమస్య ఒకటే.. అధిక బరువు లేదా ఊబకాయం..

Overweight or Obese: ప్రస్తుతం అందర్నీ వేధిస్తున్న సమస్య ఒకటే.. అధిక బరువు లేదా ఊబకాయం.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో 51% మంది మహిళలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లుగా ఓ సర్వేలో తేలింది. అంటే రాజధాని నగరంలోని ప్రతీ ఇద్దరు మహిళలలో ఒకరు అధిక బరువు(ఊబకాయం)తో ఇబ్బంది పడుతున్నారు. ఇక అత్యల్పంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు ఈ సమస్యను కలిగి ఉన్నారని తేలింది.

2019-20 సంవత్సరానికి గానూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) విడుదల చేసిన రిపోర్ట్‌ నుంచి తెలంగాణ మహిళల జనాభా, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌(సీఎస్‌డీ) ఓ నివేదిక రూపొందించింది. ఇక మొత్తం తెలంగాణలోని మహిళల్లో 30.1శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్టుగా ఆ సర్వేలో వెల్లడైంది.

అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వివిధ రకాల పద్ధతులున్నాయి. ఎక్సర్‌సైజ్, ప్రకృతి వైద్యం, డైటింగ్, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వంటింటివి చేస్తే త్వరగానే ఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story