తెలంగాణలో కొత్తగా 5,567 కేసులు, 23 మరణాలు

తెలంగాణలో కొత్తగా 5,567 కేసులు, 23 మరణాలు
కరోనా విజృంభణ తెలంగాణను హడలెత్తిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజలను వణికిస్తున్నాయి.

కరోనా విజృంభణ తెలంగాణను హడలెత్తిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజలను వణికిస్తున్నాయి. కొవిడ్ బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతుంటే.. భారీగా చేరుకుంటున్న రోగులతో హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొన్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా 5 వేల 567 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వైరస్ బారిన పడి 23 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3 లక్షాల 73 వేల 468కి చేరింది. అలాగే ఇప్పటివరకు మొత్తం ఒక వెయ్యి 899 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 49 వేల781 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక రోజురోజుకు విజృంభిస్తున్న కోవిడ్ వైరస్.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోను రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 989 కరోనా కేసులు నిర్ధారణ అయింది. రంగారెడ్డి 437, మేడ్చల్, 421, నిజామాబాద్ 367 కేసులు, కామారెడ్డి 206, జగిత్యాల 200, మంచిర్యాల 185 కేసులు, సిద్దిపేట 183, సంగారెడ్డి 176, నల్లగొండలో 161 కేసులు నమోదు వెలుగుచూసాయి.

Tags

Read MoreRead Less
Next Story