ఆ డబ్బు కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదు.. హైకోర్టుకు సీఎస్ వివరణ
Telangana: కోర్టు ధిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 58 కోట్లు విడుదల చేసిందనడంపై CS వివరణ ఇచ్చారు. ఆ డబ్బు కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసమే ఉపయోగిస్తున్నట్టు విTelanganaవరించారు. ఈవిషయంలో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. విచారణ సమయంలో వాస్తవాలు కోర్టు ముందు ఉంచలేకపోయామని విచారం వ్యక్తం చేసిన సీఎస్.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.
ఈ వాదనలు విన్న కోర్టు సోమవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అటు, ఈ జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటి? కాగితంపై రాసిందేమిటి? అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమేనన్న విధంగానే జీవో ఉందని, ఇలాంటి జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూసుకవాలి కదా అని నిలదీసింది. చివరికి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం 58 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నిన్న ట్రెజరీ నుంచి నిధుల విడుదల నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాళ ఆ 58 కోట్లపై వివరణ ఇచ్చిన CS.. కోర్టు ఆ ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com