తెలంగాణలో కొత్తగా 5,926 కేసులు.. 18 మరణాలు..!

తెలంగాణలో కొత్తగా 5,926 కేసులు.. 18 మరణాలు..!
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 5వేల926 కేసులు నమోదుకాగా.. 18 మరణాలు సంభవించాయి.

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 5వేల926 కేసులు నమోదుకాగా.. 18 మరణాలు సంభవించాయి. సెకండ్ వేవ్ ఉధృతి మొదలైన దగ్గరి నుంచి ఈ స్థాయిలో నమోదుకావడం తొలిసారి. మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల61వేల 359కి చేరింది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1856కు పెరిగాయి. ప్రస్తుతం 42వేల853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 793, మేడ్చల్ జిల్లా 488, నిజామాబాద్ జిల్లా 444, రంగారెడ్డి 455, కామారెడ్డి 262, జగిత్యాల 205, వరంగల్ అర్బన్ లో 208 కరోనా కేసులు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story