TG: మందుబాబులకు శుభవార్త

'తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాల విస్తరణ దిశగా మరో అడుగు పడింది. ప్రజలకు మరింత విస్తృతంగా మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) తాజాగా 604 కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకానికి దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు మొత్తం 92 మద్యం సరఫరా సంస్థలు దరఖాస్తు చేయగా, అందులో 45 పాత కంపెనీలు 218 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు, 47 కొత్త కంపెనీలు 386 రకాల బ్రాండ్లకు అనుమతి కోరాయి.
దేశీయంగా 331 బ్రాండ్లు
మొత్తం దరఖాస్తులలో 331 బ్రాండ్లు 'ఇండియన్ మెడ్ లిక్కర్స్' కాగా, 273 బ్రాండ్లు ఫారిన్ లిక్కర్ బ్రాండ్లుగా గుర్తించారు. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు రాగా.. 45 పాత కంపెనీల నుంచి 218 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొంది. తెలంగాణలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం 47 కొత్త కంపెనీలు 386 రకాల బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com