తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు.. 33 మంది మృతి..!

తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు.. 33 మంది మృతి..!
X
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7 వేల 432 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 33 మంది మరణించారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. సెకండ్ వేవ్‌లో కోవిడ్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండగా.. రోజురోజుకు రికార్డుస్ధాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7 వేల 432 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 33 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 58 వేల 148కి చేరగా.. 2 వేల 157 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఇక గ్రేటర్‌లో తొలిసారిగా 15 వందల మార్క్‌ను చేరువ అవుతోంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒక వెయ్యి 464 కేసులు నమోదు కాగా.. రెండోస్థానంలో మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 606 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 39 కేసులు నమోదు అయ్యాయి.

Tags

Next Story