Medical Colleges in Telangana: తెలంగాణా రాష్ట్రంలో ఓ నూతన అధ్యాయం.. ఒకేసారి 8మెడికల్ కాలేజీలు ప్రారంభం

Medical Colleges in Telangana: తెలంగాణా రాష్ట్రంలో ఓ నూతన అధ్యాయం.. ఒకేసారి 8మెడికల్ కాలేజీలు ప్రారంభం
Medical Colleges in Telangana: తెలంగాణా రాష్ట్రంలో వైద్యవిద్యారంగంలో ఓ నూతన అధ్యాయం ఆరంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8మెడికల్ కాలేజీలలో ఇవాళ్టి నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

Medical Colleges in Telangana: తెలంగాణా రాష్ట్రంలో వైద్యవిద్యారంగంలో ఓ నూతన అధ్యాయం ఆరంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8మెడికల్ కాలేజీలలో ఇవాళ్టి నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇది రాష్ట్ర, దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా చెప్పవచ్చు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 5మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 8 కాలేజీలు ప్రారంభం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించేనాటికే ఉస్మానియా, గాంధీలు ఉండగా.. ఆ తర్వాత 57 ఏళ్లలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇవాళ కాలేజీల ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ వర్చువల్‌గా హైదరాబాద్‌నుంచి ప్రారంభిస్తుండగా.. మంత్రి హరీష్‌ రావు సంగారెడ్డిలో తరగతులను ప్రారంభిస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్రప్రభుత్వం మొదటి దశలో మహబూబ్‌ నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట్‌లో మెడిల్‌ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఇక రెండో దశలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డిలో కాలేజీలను ఏర్పాటు చేసింది.


దీంతో కాలేజీల సంఖ్య తెలంగాణాలో 17కు పెరిగాయి. కొత్తగా ఏర్పాటైన ఈ 8 కాలేజీల్లో ఇవాళ్టినుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 9, ఆ తర్వాత వచ్చే ఏడాది మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్‌ కాలేజీ కల నెరవేరనున్నది.


కొత్త కాలేజీలతో రాష్ట్రంలో అదనంగా 1,150 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2014లో 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పుడు 2,790 కి పెరిగాయి. పీజీ సీట్లు 531 నుండి 1122 కు పెరిగాయి. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152 కు పెరిగాయి. కొత్త మెడిక‌ల్ కాలేజీల‌తో ప్రజ‌ల‌కు నాణ్యమైన వైద్యం అందనుంది.

ఈ మెడిక‌ల్ కాలేజీల ద్వారా నాణ్యమైనవైద్య సేవలు ప్రజ‌లకు అందనున్నాయి. ఇందులో మొత్తం 35 వైద్య విభాగాలు సేవ‌లందిస్తాయి. అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, ల్యాబ్స్ ఉంటాయి. 449 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. 600 పైగా పారామెడిక‌ల్ సిబ్బంది సేవలు అందించనున్నారు.


అయితే పెద్ద పెద్ద వ్యాధులు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరంలేకుండా .... ప్రజలు ఇకనుంచి తమ సమీపంలోని ఈ మెడికల్ కాలేజీలకు వెళ్లి నాణ్యమైన వైద్యం పొందే అవకాశం ఉంది. మరోవైపు కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 8 ఏళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు లభించనుంది.

Tags

Read MoreRead Less
Next Story