88వ రోజు భట్టి పీపుల్స్ మార్చ్

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉదయం గుమ్మడవెల్లి నుంచి మొదలైన యాత్ర... పాల్వాయి, మైలవరం జునుతల క్రాస్‌రోడ్ మీదుగా సాగుతోంది. దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుకుంటూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క.
పాల్వాయి శివారులో పలువురు మహిళలు.. భట్టికి తమ బాధలను చెప్పుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్‌లో తొమ్మిది సరుకులు ఇచ్చేవారు. గ్యాస్ రేటు నాలుగు వందలు ఉండేది.. ఇప్పుడు గ్యాస్ కొనాలంటే భయం వేస్తోందని చెప్పారు. కూలీ చేసుకుని బతికేవాళ్లం.. ఇంతింత ధరలు పెట్టి ఎలా కొనాలని భట్టి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలు విన్న భట్టి విక్రమార్క వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ రెండు గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్, రేషన్ షాపులో 9 సరకులు అందిస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com