ఉద్యమంలా.. 9వ విడత హరితహారం

హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి శ్రీకారం చుట్టారు. సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు.
పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని, కాంగ్రెస్ నేతల అడ్డంకుల ఆలస్యం అయ్యిందన్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రాజెక్టు 80శాతం పూర్తి చేశామన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్‌లో నీటి కష్టాలు తీరుతాయన్నారు. మహేశ్వరానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని ప్రకటించారు. తుమ్మలూరులో సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com