GHMC అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 11 ఏళ్ల బాలిక

GHMC : తన విన్నపాన్ని పట్టించుకోలేదంటూ హైదరాబాద్ లోని GHMC అధికారులపై ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ మాదాపూర్ డీసీపీకి 11 ఏళ్ల బాలిక శిల్పవల్లి ఫిర్యాదు చేసింది. శేర్‌లింగంపల్లి రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండటంతో ... యాక్సిడెంట్ల నివారణకోసం చర్యలు చేపట్టాలని నాలుగు నెలలక్రితం జీహెచ్ ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసింది. అదేవిషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ కూడా జీహెచ్ ఎంసి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాడని పేర్కొంది. అయితే వారు ఎలాంటి చర్యలుతీసుకోకపోవడంతో.. అదేప్రాంతంలో తాజాగా ఓ కారు బైక్‌ను ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డట్లు బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com