Khammam: ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం.. ఆ అనుమానంతోనే..

X
By - Divya Reddy |31 Aug 2022 12:30 PM IST
Khammam: ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
Khammam: ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో చోటుచేసుకుంది. LIC ఏజెంట్ శాంతయ్య ఈనెల 21న అతిగా మద్యం సేవించి కింద పడి చనిపోయాడని అతని భార్య రాజేశ్వరి బంధువులకు తెలిపింది. దీంతో మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లి ఖననం చేశారు. రాజేశ్వరి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుని అన్న.. ఖమ్మం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com