Bethi subhas reddy : భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే .. కేసు నమోదు..!

X
Bethi subhas reddy : భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు జవహర్ నగర్ పోలీసులు. కాప్రా లోని సర్వే నెంబర్ 152 లో 90 ఎకరాల భూమి వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కాప్రా తహసిల్దార్ గౌతమ్ కుమార్ పై కూడా కేసు నమోదు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక భూ యజమాని తన క్లైంట్ జూలకంటి నాగరాజును బెదిరించి భూమి కబ్జాకు ప్రయత్నించారని ఫిర్యాదు చేసినట్లు అడ్వకేట్ మేకల శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. దీనిలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు వీరి పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
