SR Nagar: సరసాల కోసం అద్దె ఇల్లు డ్రామా.. ఉన్నట్టుండి ఓనర్ రావడంతో సీన్ రివర్స్..

SR Nagar: ఈ మధ్య పబ్లిక్ రొమాన్స్ బాగా పెరిగిపోయింది.. మెట్రో సిటీస్‌లో ప్రేమపక్షుల రాసలీలలు అక్కడో ఇక్కడో కనిపిస్తూనే ఉంటాయి.. అయితే, హైదరాబాద్ లో కొత్త జంటో.. ప్రేమజంటో తెలియదుగానీ.. ఓ జంట తమ సరసాలకు ఎక్కడా చోటు దొరక్క అద్దె కోసం ఇల్లు వెతుక్కుని మరీ శృంగారంలో మునిగిపోయారు. అయితే, మధ్యలో ఓనర్ ఎంటర్ కావడంతో సీన్ రివర్స్ అయింది..
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.. వీళ్ల యవ్వారమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో అద్దె ఇంటి కోసం ఓ జంట వేట మొదలు పెట్టింది.. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ముందు టూలెట్ బోర్డు కనిపించడంతో యువతీ యువకులిద్దరూ ఆగారు.. ఇంటి ముందు కనిపించిన ఓనర్‌తో మాట్లాడారు.. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు..
సెకండ్ ఫ్లోర్‌లో ఇల్లు ఖాళీగా ఉందని ఓనర్ చెప్పగా.. ఓసారి చూసొస్తామని చెప్పారు.. చూడటానికే కదా అని ఓనర్ కూడా అభ్యంతరం చెప్పలేదు.. అక్కడ్నుంచి సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇంట్లోకి వెళ్లిన జంట ఎంతసేపైనా తిరిగి రాలేదు.. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లి చూశాడు.. అయితే, అప్పటికే సరసాలాడుతూ ఆ జంట కనిపించింది.
ఓనర్‌ను చూసిన ఆ జంట అక్కడ్నుంచి పరుగులు పెట్టుకుంటూ బయటకు వెళ్లిపోయారు.. ఓనర్‌ను చూసి ఆ జంట పరుగులు పెడుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. వీళ్ల యవ్వారాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇల్లు అద్దెకు కావాలని ఇలాంటి పనులేంటంటూ చీవాట్లు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com