వావ్.. సీసాలో ఎడ్లబండి.. క్రియేటివిటికి నెటిజన్లు ఫిదా!

నేల తల్లిని నమ్ముకొని, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, నిరంతరం శ్రమిస్తూ, పంటలను పండించి, దేశానికి వెన్నెముకగా నిలిచేవాడే రైతు.. రైతు లేనిదే తిండి లేదు. అసలు రైతు లేనిదే దేశం లేదని చెప్పాలి. ఈరోజున ప్రతి మనిషి కడుపు నిండా అన్నం తింటున్నాడంటే అది రైతు చలువేనని చెప్పాలి. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఓ యువ రైతు వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన ఏండ్ల బండిని ఓ సీసాలో రూపొందించాడు. సీసా ఎక్కడ కూడా పగలకుండా చాలా జాగ్రత్తగా దీన్ని తీర్చిదిద్దాడు. వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతగట్టు గ్రామానికి చెందిన సోమోజు కిరణ్‌కుమార్ అనే వ్యక్తి ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే దీనిని సీసాలో తీర్చిదిద్దడానికి నెలరోజుల సమయం పట్టిందని కిరణ్‌కుమార్ చెప్పుకొచ్చాడు. కిరణ్‌కుమార్ ప్రతిభను నెటిజన్లు అభినందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com