Hyderabad : ఆస్తి కోసం భార్యతో యాసిడ్ తాగించిన కసాయి భర్త

Hyderabad : ఆస్తుల కోసం కిరాతకానికి ఒడిగట్టాడు.. కట్టుకున్న భార్యకే యాసిడ్ తాగించాడు.. విషయం బయటకు పొక్కకుండా వివస్త్రను చేసి నిర్బంధించాడు.. కిరాతక భర్త నుంచి తప్పించుకోవడంతో ప్రాణాలు దక్కాయి.. సకాలంలో వైద్యం అందటంతో బతికి బట్టకట్టింది ఆ ఇల్లాలు.. ఈ క్రూర ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
తన భర్త నుంచి తన్ను కాపాడండి అంటూ బోడ పద్మ అనేక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. బోడ పద్మ భర్త కొర్ర ధర్మానాయక్.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2008 ఏసీబీ ఆస్తులను అటాచ్ చేసింది.
ఈ నేపథ్యంలోనే భార్య పేరుతో ఉన్న ఆస్తులను తన పేరుపైకి మార్చాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. భార్యతో బలవంతంగా బ్యాంక్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోదని.. మీడియాను ఆశ్రయించింది బాధితురాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com