జగిత్యాలలో వినూత్న నిరసనకు దిగిన వ్యక్తి.. రూ. 5 వేలు జరిమానా..!

జగిత్యాలలో వినూత్న నిరసనకు దిగిన వ్యక్తి.. రూ. 5 వేలు జరిమానా..!
జగిత్యాలలో ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. పట్టణంలోని ఎల్జీ రాం లాడ్జీ వెనుక ఉండే ప్రభాకర్ అనే వ్యక్తి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగాడు.

తాను నాటిన చెట్టును కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ... జగిత్యాలలో ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. పట్టణంలోని ఎల్జీ రాం లాడ్జీ వెనుక ఉండే ప్రభాకర్ అనే వ్యక్తి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగాడు. తనకు రావాల్సిన ఆస్తిని.... తమ సోదరులు ఇవ్వడం లేదని, అంతే కాకుండా తను నాటిన చెట్టును సైతం కొట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ వైపు చెట్లు నాటాలని ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు చెట్లను కొట్టేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ చేశాడు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు.... చెట్టున కొట్టేసిన వ్యక్తికి ఐదువేల రూపాయలు జరిమాన విధించారు.

Tags

Next Story