Minor Girl Missing : ఖమ్మం జిల్లాలో ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం

Minor Girl Missing : ఖమ్మం జిల్లాలో ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం
X
ఖమ్మం జిల్లాలో ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. తమ కూతురు అదృశ్యం వెనుక క్షుద్రపూజలే కారణమై ఉంటాయని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో జరిగింది.

ఖమ్మం జిల్లాలో ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. తమ కూతురు అదృశ్యం వెనుక క్షుద్రపూజలే కారణమై ఉంటాయని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో జరిగింది. నరసింహారావు తన ఇంట్లో లంకె బిందులు ఉన్నాయని బెంగుళూరుకు చెందిన ఓ పూజారితో గత కొన్ని రోజులు క్షుద్రపూజలు చేస్తున్నాడు. నరసింహారావు అల్లుడైన శివనాగేశ్వరరావు తన అన్నకూతురైన ఓ మైనర్ బాలికతో పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో.. బాలిక అనారోగ్యంగా ఉందని.. గుంటూరులోని ఓ దేవాలయంలో పూజలు చేయించాలని వాళ్లను ఈ నెల 17న పంపారు.

అయితే గుంటూరు నుంచి తిరిగివచ్చాక.. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అటు నరసింహారావు ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురు ఎక్కడ ఉందని అడిగితే... నరసింహారావు, శివనాగేశ్వరరావు పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story