Nalgonda Psycho : సైకో హల్‌చల్‌.. తలకు రుమాలు కట్టుకుని.. ఒంటికి నూనె పూసుకుని..

Nalgonda Psycho : సైకో హల్‌చల్‌.. తలకు రుమాలు కట్టుకుని.. ఒంటికి నూనె పూసుకుని..
X
Nalgonda Psycho : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ సైకో హల్‌చల్‌ చేస్తున్నాడు. పట్టణంలోని 43 వార్డులో గత 15 రోజులుగా ఓ వ్యక్తి రాత్రి వేళల్లో సంచరిస్తున్నాడు.

Nalgonda Psycho : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ సైకో హల్‌చల్‌ చేస్తున్నాడు. పట్టణంలోని 43 వార్డులో గత 15 రోజులుగా ఓ వ్యక్తి రాత్రి వేళల్లో సంచరిస్తున్నాడు. తలకు రుమాలు చుట్టుకుని.. ఒంటికి నూనె పూసుకుని.. అర్ధనగ్నంగా కాలనీలో తిరుగుతున్నాడు. ఎంత ఎత్తైన గోడలనైనా అవలీలగా ఎక్కేస్తున్నాడని.. బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లలోకి తొంగి చూస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. మహిళలు, పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారని... రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని అంటున్నారు. మరోవైపు కొందరు యువకులు బృందాలుగా ఏర్పడి కాలనీల్లో రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్నారు.

Tags

Next Story