Warangal : ఉపాధ్యాయుడు కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సెకండ్ క్లాస్ స్టూడెంట్

X
By - TV5 Digital Team |5 March 2022 7:00 PM IST
Warangal : విద్యా, బుద్దులు చెప్పే ఉపాధ్యాయులు అప్పుడప్పుడు విద్యార్ధులను దండించడం కామన్.
Warangal : mవిద్యా, బుద్దులు చెప్పే ఉపాధ్యాయులు అప్పుడప్పుడు విద్యార్ధులను దండించడం కామన్. కాని ఓ బుడతడు తనను ఉపాద్యాయుడు కొట్టాడంటూ ఏకంగా పోలీస్టేషన్ మెట్లెక్కాడు. తనను కొట్టిన టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ రెండో తరగతి చదువుతున్న బాలుడు ఫిర్యాదు చేశాడు. బాలుడు స్టేషన్‌కు వచ్చిన కారణం తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు.. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలో జరిగింది. బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అనిల్ అనే బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. తనను టీచర్ కొట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ధైర్యంగా పోలీస్టేషన్‌కు వెళ్లి.. ఎస్‌ఐకి ఫిర్యాదు చేశాడు. బాలుడి కోరిక మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com